బుధవారం 30 సెప్టెంబర్ 2020
Telangana - Sep 09, 2020 , 04:02:39

మాట్లాడే సత్తా లేకే విమర్శలు

మాట్లాడే సత్తా లేకే విమర్శలు

  • కాంగ్రెస్‌పై టీఆర్‌ఎస్‌ నేతలఫైర్‌
  • స్పీకర్‌, సీఎంపై విమర్శలుతగవు
  • విప్‌ బాల్క సుమన్‌, ఎమ్మెల్యేలు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రభుత్వాన్ని ఎలాగైనా బద్నాంచేయాలని కాంగ్రెస్‌ నేతలు చూస్తున్నారని అసెంబ్లీలో విప్‌ బాల్కసుమన్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. మాట్లాడే సత్తాలేక ఇలా వ్యవహరిస్తున్నారన్నారు. అసెంబ్లీ స్పీకర్‌ను అవమానించేలా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అసెం బ్లీ ఔన్నత్యాన్ని తగ్గించేలా కాంగ్రెస్‌ సభ్యులు మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు. సభలో సభ్యుల సంఖ్య ఆధారంగా పార్టీలకు మా ట్లాడే అవకాశం కల్పించాలని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కోరుతామని పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణభవన్‌లో బాల్క సు మన్‌ మాట్లాడుతూ..  పీవీకి భారతరత్నపై మాట్లాడే సమయంలో సభ్యుల సంఖ్య ఆధారంగా టీఆర్‌ఎస్‌కు 74 నిమిషాలు, కాంగ్రెస్‌కు 5 నిమిషాలు రావాలని, కానీ స్పీకర్‌ కాంగ్రెస్‌కు 10 నిమిషాలు కేటాయించారని గుర్తుచేశారు. స్పీకర్‌ పెద్ద మనసుతో కాంగ్రెస్‌ సభ్యులిద్దరికి అవకాశమిచ్చారని చెప్పారు.

సీనియర్‌ సభ్యులైన  భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి కూడా ఇలా మాట్లాడటం సరికాదని హితవుపలికారు. స్పీకర్‌ అందరినీ సమాన దృష్టితో చూస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్‌వి చిల్లర రాజకీయాలు సీఎం కేసీఆర్‌ను విమర్శించడమంటే రాష్ట్ర ప్రజలను అవమానించినట్టేనని ఎమ్మెల్యే బీ రం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు చిల్లర రాజకీయాలుచేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే మెతుకు అనంద్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ సభ్యులకు ప్రజాసమస్యలు ప్రస్తావించడం కన్నా పరుష పదజాలం వాడటంపైనే మమకారమున్నదని తెలిపారు. ఎమ్మె ల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు ఉన్నదే ఆరుగురు ఎమ్మెల్యేలని, వారికే ఎక్కువ సమయమిస్తే తాము ఎక్కడికి పోవాలని ప్రశ్నించారు. బీఏసీలో నిర్ణయించిన ప్రకారమే సమయం కేటాయిస్తున్నారని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. 


logo