e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home తెలంగాణ విప్‌ బాల్క సుమన్‌కు పితృవియోగం

విప్‌ బాల్క సుమన్‌కు పితృవియోగం

విప్‌ బాల్క సుమన్‌కు పితృవియోగం

మెట్‌పల్లి, మే 28/హైదరాబాద్‌ (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ విప్‌, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి బాల్క సురేశ్‌(62) అనారోగ్యంతో కొద్దిరోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ దవాఖానలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు. సురేశ్‌ టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా సేవలందించారు. సురేశ్‌ సతీమణి ముత్తమ్మ మెట్‌పల్లి 13వ వార్డు కౌన్సిలర్‌గా కొనసాగుతున్నారు.

సురేశ్‌ మృతికి సీఎం కేసీఆర్‌ సంతాపం

ప్రభుత్వ విప్‌ బాల సుమన్‌ తండ్రి బాల సురేశ్‌ మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. మెట్‌పల్లి మారెట్‌ కమిటీ చైర్మన్‌గా పనిచేసిన సురేశ్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ క్రియాశీల నాయకుడిగా చురుకైన పాత్రపోషించారని గుర్తుచేసుకున్నారు. బాల్క సుమన్‌కు ఫోన్‌చేసి పరామర్శించి ఓదార్చారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరోవైపు, సురేశ్‌ మృతిపై శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు కేటీఆర్‌, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, సత్యవతి రాథోడ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు తదితరులు సంతాపం తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
విప్‌ బాల్క సుమన్‌కు పితృవియోగం

ట్రెండింగ్‌

Advertisement