బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 13:36:52

బాలాపూర్‌ గణేశ్‌ 6 అడుగులు మాత్రమే.. లడ్డూ వేలం రద్దు

బాలాపూర్‌ గణేశ్‌ 6 అడుగులు మాత్రమే.. లడ్డూ వేలం రద్దు

హైదరాబాద్‌ : కరోనా వ్యాప్తి దృష్ట్యా బాలాపూర్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. గురువారం ఉదయం సమావేశమైన గణేశ్‌ ఉత్సవ కమిటీ.. పలు అంశాలపై చర్చించింది. వినాయకుడి విగ్రహం ఎత్తు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. 21 అడుగులకు బదులుగా ఈసారి 6 అడుగుల విగ్రహాన్ని మాత్రమే పెట్టాలని నిర్ణయించింది. ఈ ఏడాది లడ్డూ వేలం కూడా నిర్వహించొద్దని కమిటీ నిర్ణయం తీసుకుంది. గణేశ్‌ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మాత్రమే తొలిపూజ నిర్వహించనున్నట్లు కమిటీ ప్రకటించింది. కరోనా దృష్ట్యా ఈ ఏడాది భక్తుల పూజలు, దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. గణేశ్‌ శోభాయాత్రపై అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని ఉత్సవ సమితి పేర్కొంది. 


logo