శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 07, 2020 , 16:32:46

ఉత్తరాలు, ఆధార్‌ కార్డులు పంచకుండా... కాల్చారు..

ఉత్తరాలు, ఆధార్‌ కార్డులు పంచకుండా... కాల్చారు..

హైదరాబాద్‌: పోస్ట్‌ ఆఫీసుకు వచ్చిన ఉత్తరాలు, ఆధార్‌కార్డులు, ఆర్డినరీ పోస్ట్‌లను ఆయా అడ్రస్‌లకు పంచకుండా కాల్చేశారు. కీసర సమీపంలోని రాంపల్లి, బండ్లగూడ ఏరియాలో పోస్టు బ్యాగులో వేసుకెళ్లి తగలబెట్టారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న బాలానగర్‌ పోలీసులు ఐదుగురు పోస్ట్‌మెన్లను, వారికి సహకరించిన మరో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు, దీనిపై పోస్టల్‌ ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. 


logo