సోమవారం 26 అక్టోబర్ 2020
Telangana - Aug 09, 2020 , 22:15:43

బైరామల్‌గూడ ఫ్లైఓవర్‌ సోమవారం ప్రారంభం

బైరామల్‌గూడ ఫ్లైఓవర్‌ సోమవారం ప్రారంభం

హైదరాబాద్‌ : నగరంలో సోమవారం నుంచి మరో ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రానుంది. బైరామల్‌గూడ కుడివైపు ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్‌ సోమవారం ప్రారంభించనున్నట్లు మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. ప్యాకేజీ-2లో భాగంగా రూ.448 కోట్ల వ్యయంతో చేపట్టిన 14 పనుల్లో ఇప్పటికే 6 పూర్తైనట్లు చెప్పారు. మిగిలిన పనులు సైతం వివిధ దశల్లో ఉన్నాయన్నారు. బైరామల్‌గూడ వంతెన నిర్మాణంలో ప్రత్యేక టెక్నాలజీ వాడినట్లు వెల్లడించారు. ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రావడంతో బైరామల్‌గూడ జంక్షన్‌, సాగర్‌ రింగ్‌రోడ్‌ జంక్షన్‌లో ట్రాఫిక్‌ ఇబ్బందులు తీరనున్నట్లు మేయర్‌ పేర్కొన్నారు.


logo