సోమవారం 25 జనవరి 2021
Telangana - Dec 02, 2020 , 01:17:27

సీటు కోసం వేసిన బ్యాగు మాయం

సీటు కోసం వేసిన బ్యాగు మాయం

  • 6 తులాల బంగారం, రూ.6 వేలు అపహరణ
  • నారాయణపేట బస్టాండ్‌లో ఘటన

నారాయణపేట: బస్సు సీటు కోసం కిటికీలో నుంచి వేసిన ఓ ప్రయాణికురాలి బ్యాగు అపహరణకు గురైంది. ఈ ఘటన మంగళవారం నారాయణపేట ఆర్టీసీ బస్టాండ్‌లో చోటుచేసుకున్నది. బ్యాగులో ఆరు తులాల బంగారం,రూ.6 వేల నగదు ఉన్న ట్టు బాధితురాలు వాపో యింది. నారాయణపేట మండలం అమ్మిరెడ్డిపల్లికి చెందిన హైమావతి తన ఇద్దరు పిల్లలను తీసుకొని హైదరాబాద్‌ వెళ్లేందుకు తండ్రి కృష్ణారెడ్డితో కలిసి నారాయణపేట బస్టాండ్‌కు చేరుకున్నది. బస్సు డోర్‌ వద్ద ప్రయాణికులు ఎక్కువగా ఉండటంతో సీటు కోసం తన బ్యాగును కిటికీలోంచి సీటుపై పెట్టింది. ఆ తర్వాత బస్సులోకి వెళ్లి చూడగా సీటుపై ఉంచిన బ్యాగు కనిపించలేదు. ఒక్కసారిగా ఆందోళనకు గురైన హైమావతి వెంటనే తేరుకొని తన బ్యాగ్‌ పోయిందని కేకలు వేసింది. సమాచారం అందుకున్న పోలీసులు బస్సులోని ప్రయాణికులను తనిఖీ చేసినా ఆచూకీ లభించలేదు. బ్యాగులో రూ.3 లక్షల విలువ చేసే 6 తులాల బంగారు ఆభరణాలతోపాటు రూ.6 వేల నగదు ఉన్నట్టు బాధితురాలు హైమావతి, ఆమె తండ్రి కృష్ణారెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నారాయణపేట పోలీసులు పేర్కొన్నారు. 


logo