Telangana
- Jan 06, 2021 , 09:54:49
బ్యాడ్మింటన్ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్ కిడ్నాప్

హైదరాబాద్ : బోయిన్‌పల్లిలో చోటు చేసుకున్న కిడ్నాప్ ఘటన సుఖాంతంగా ముగిసింది. బ్యాడ్మింటన్ జాతీయ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్‌ను కిడ్నాప్ చేశారు. ఐటీ అధికారులమంటూ అర్ధరాత్రి ప్రవీణ్ ఇంట్లోకి ప్రవేశించారు. ప్రవీణ్‌తో పాటు అతని సోదరులు సునీల్, నవీన్‌ను అపహరించారు. ప్రవీణ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో హైదరాబాద్ నార్త్ జోన్ పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులు రంగంలోకి దిగి ఆ ముగ్గురిని కిడ్నాపర్ల నుంచి కాపాడారు. కిడ్నాప్ అయిన ముగ్గిరిని వికారాబాద్‌లో గుర్తించారు పోలీసులు. బోయిన్‌పల్లిలోని ప్రవీణ్ ఇంటి వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కిడ్నాపర్లు రాయలసీమకు చెందిన ఓ నేత పేరు ప్రస్తావించినట్లు బాధితులు తెలిపారు. ఆ దిశగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.
తాజావార్తలు
MOST READ
TRENDING