శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Oct 27, 2020 , 02:49:47

పెద్ద తలతో శిశువు జననం

పెద్ద తలతో శిశువు జననం

  • హైదరాబాద్‌లోని నిలోఫర్‌కు తరలింపు

భీంపూర్‌: ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లో సోమవారం మధ్యాహ్నం సువర్ణ అనే  గర్భిణికి పెద్ద తలతో పాప పుట్టింది. వెంటనే చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని నిలోఫర్‌కు తరలించారు. సాధారణంగా నవజాత శిశువు తల 33-36 సెంటీమీటర్లు ఉండాలని, కానీ ఈ పాప తల అంతకుమించి ఉన్నదని వైద్యులు తెలిపారు. ఐదోనెల స్కానింగ్‌ పరీక్షల్లో శిశువు తల పెద్దదిగా ఉన్నదని, ఆపరేషన్‌ అవసరమని వైద్యులు చెప్పినా ఆమె వినిపించుకోలేదని భీంపూర్‌ పీహెచ్‌సీ పరిధి కరంజి(టి) ఉపకేంద్ర ఆశ కార్యకర్త శశికళ, ఏఎన్‌ఎం సుజాత తెలిపారు. గతంలోనూ ఐదో నెల గర్భవతిగా ఉన్నప్పుడు స్కానింగ్‌ చేయిస్తే.. శిశువు తల పెద్దదిగా ఉందని తేలింది. అప్పుడు ఆమెను ఒప్పించి రిమ్స్‌లో అబార్షన్‌ చేయించినట్లు వారు పేర్కొన్నారు. ఈ లక్షణాలతో ఉంటే హైడ్రోసెప్లస్‌ (తలలో నీళ్లు నిండి ఇలా పెద్దదిగా ఉండటం)గా భావించవచ్చని, క్రోమోజోముల సమస్య, మేనరికాలతో కూడా ఇలా జరుగవచ్చని, 15 ఏండ్ల క్రితం ఇలాంటివి కొన్ని కేసులు నమోదయ్యాయని వైద్యాధికారులు చెబుతున్నారు. అయితే న్యూరోసోనోగ్రామ్‌ తదితర పరీక్షల తర్వాతే పూర్తి స్పష్టత ఇవ్వగలమని వారు పేర్కొన్నారు.