బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Oct 29, 2020 , 12:44:15

120 రోజుల త‌ర్వాత బాబ్లీ గేట్లు మూసివేత‌

120 రోజుల త‌ర్వాత బాబ్లీ గేట్లు మూసివేత‌

హైద‌రాబాద్ : మహా‌రా‌ష్ట్ర‌లోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లను గురు‌వారం మ‌ధ్యాహ్నం మూసివేశారు. జూలై ఒకటో తేదీ నుంచి అక్టో‌బర్‌ 28 వరకు ప్రాజెక్ట్‌ గేట్లు తెరిచి ఉంచి దిగు‌వకు నీటిని విడు‌దల చేయాలని సుప్రీంకోర్టు గ‌తంలో ఉత్త‌ర్వులు జారీ చేసిన విష‌యం తెలిసిందే. సుప్రీం ఆదేశాల ప్ర‌కారం.. 120 రోజుల త‌ర్వాత బాబ్లీ ప్రాజెక్టు గేట్ల‌ను అధికారులు మూసేశారు. కేంద్ర జ‌ల‌సంఘం, మ‌హారాష్ర్ట‌, తెలంగాణ అధికారుల స‌మ‌క్షంలో గేట్ల‌ను మూసేశారు.