బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 04, 2020 , 00:56:22

హరితహారంలో అగ్రగామిగా నిలపాలి

హరితహారంలో అగ్రగామిగా నిలపాలి

  • ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ 

రాజన్న సిరిసిల్ల, నమస్తే తెలంగాణ: సీఎం కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారంలో జిల్లాను అగ్రగామిగా నిలపాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ పిలుపునిచ్చారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నాగారంలో సీఎం ఓఎస్డీ ప్రియాంకవర్గీస్‌, ఐడీసీ చైర్మన్‌ ఈద శంకర్‌రెడ్డితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. సాగునీరు, వ్యవసాయ రంగంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణను హరితహారంలోనూ అగ్రగామిగా నిలిపేందుకు కృషిచేయాలన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం పదిర అటవీ ప్రాంతంలో 200 ఎకరాల్లో అర్బన్‌ పార్కు కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఓఎస్డీ అధికారులను ఆదేశించారు. మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో ఈ ప్రాంతంలో అర్బన్‌ పార్కు ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించినట్లు ఆమె తెలిపారు.

తాజావార్తలు


logo