శుక్రవారం 03 జూలై 2020
Telangana - Jun 05, 2020 , 00:48:01

ప్రతి ఎకరాకు గోదావరి జలాలు

ప్రతి ఎకరాకు గోదావరి జలాలు

  • సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో చొప్పదండికి నీళ్లు
  • ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌

రామడుగు: సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో చొప్పదండి నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు గోదావరి జలాలను అందించే దిశగా ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలంలోని గాయత్రి పంప్‌హౌజ్‌ కాన్ఫరెన్స్‌ హాలులో గురువారం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. చొప్పదండి, రామడుగు, గంగాధర, మల్యాల, బోయినపల్లి మండలాల్లో వరద కాలువలకు తూముల నిర్మాణం, నారాయణపూర్‌లో నిలిచిపోయిన పనులపై చర్చించారు. అనంతరం వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. వరద కాలువకు ఏర్పాటుచేసే తూముల ద్వారా చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల్లోని ప్రతి ఎకరాకు నీళ్లిచ్చేలా ఆలోచించినట్లు తెలిపారు. 

 వరద కాలువకు నీటిని తీసుకెళ్లే గ్రావిటీ కాలువకు ఒక తూమును ఏర్పాటుచేసి రామడుగు మండలంలోని ఐదారు చెరువులను పూర్తిస్థాయిలో నింపడానికి సిద్ధంచేసిన ప్రణాళికను ఎమ్మెల్యే రవిశంకర్‌ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. నారాయణపూర్‌ రిజర్వాయర్‌ నుంచి కుడి, ఎడమ కాలువలతోపాటు పోతారం కొడిమ్యాల చెరువులు, వేములవాడ నియోజకవర్గంలోని ఫాజుల్‌నగర్‌ చెరువు, రుద్రంగి వరకు నీటి సరఫరా చేయనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి భూసేకరణతోపాటు ఇతర సమస్యల పరిష్కారం కోసం ప్రణాళికలు తయారు చేసినట్లు చెప్పారు.


logo