గురువారం 04 జూన్ 2020
Telangana - Dec 04, 2019 ,

గ్రీన్ ఛాలెంజ్ లో అజహరుద్దీన్

గ్రీన్ ఛాలెంజ్ లో అజహరుద్దీన్

హైదరాబాద్ : ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కు మద్దతుగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హరిత యజ్ఞాన్ని చేపట్టారు. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా హెచ్ సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్ ఇవాళ మొక్కలు నాటారు. అనంతరం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కు అజహరుద్దీన్ గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ చాలా మంచి కార్యక్రమమని అజహరుద్దీన్ కొనియాడారు. 


మరోవైపు టీయూఎఫ్ ఐడీసీ చైర్మన్ విప్లవ్ కుమార్, ఉప్పల్ ఎమ్మెల్యే భేతి శుభాష్ రెడ్డి కూడా హరిత సవాల్ లో భాగంగా మొక్కలు నాటారు. విప్లవ్ కుమార్ ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్, వెంకటేష్ నేతకాని, పీసీసీఎఫ్ శోభారాణి లను గ్రీన్ ఛాలెంజ్ కు నామినేట్ చేశారు. ఎమ్మెల్యే భేతి శుభాష్ రెడ్డి మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద, అరికపూడి గాంధీలకు గ్రీన్ సవాల్ విసిరారు. 
logo