గురువారం 28 మే 2020
Telangana - May 10, 2020 , 19:45:40

అందుబాటులోకి ఆయుర్వేద మాస్క్‌లు

అందుబాటులోకి ఆయుర్వేద మాస్క్‌లు

నారాయణపేట: కరోనా వైరస్‌ నివారణకు నారాయణపేట జిల్లా మహిళా సంఘాల సభ్యులు వినూత్నమైన ఆలోచనతో మాస్క్‌లు తయారుచేసి రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందుతున్నారు. కలెక్టర్‌ హరిచందన సూచనల మేరకు వైరస్‌ ప్రభావం  ఏమాత్రం  ఉండని ఆయుర్వేద మాస్క్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు. వారం రోజుల తర్వాత శుభ్రపరిచి తిరిగి వాడుకొనేలా వీటిని తయారుచేశారు. 

ఆయుర్వేద వైద్యులు కర్పూరం, పుదీన, యూకలిప్టస్‌, వామ ఆకులు, లవంగాల నూనెతో తయారుచేసిన ద్రావణంలో ఈ మాస్క్‌లను అరగంటపాటు వేడిచేసి ఆరబెట్టడం ద్వారా రోగ నిరోధకశక్తిని పెంచడంతోపాటు వైరస్‌ సోకకుండా తోడ్పడుతుంది. డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో చేనేత మహిళా కార్మికులతోపాటు మహిళా సంఘాల సభ్యులు వీటిని తయారుచేస్తున్నారు. ఇప్పటికే 4 లక్షల మాస్క్‌లను తయారుచేసి మార్కెట్లోకి సరఫరా చేశారు. ఒక్కో మాస్క్‌ ధర రూ.100 గా నిర్ణయించారు. మాస్క్‌లు కావాల్సినవారు 8790990606, 9848488894 నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.


logo