బుధవారం 03 జూన్ 2020
Telangana - May 11, 2020 , 01:31:46

కరోనా కట్టడికి ఆయుర్వేద మాస్కులు

కరోనా కట్టడికి ఆయుర్వేద మాస్కులు

నారాయణపేట, నమస్తే తెలంగాణ: నారాయణపేట జిల్లాకు చెందిన మహిళా సంఘాల సభ్యులతోపాటు చేనేత మహిళా కార్మికులు డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఆయుర్వేద మాస్కులను రూపొందిస్తున్నారు. ఇప్పటికే నాలుగు లక్షలకుపైగా తయారుచేశారు. ఒక్కో మాస్కుకు రూ.100 ధర నిర్ణయించారు. కర్పూరం, పుదీన, జామాయిల్‌, వామ ఆకులు, లవంగాల నూనెతో ఆయుర్వేద వైద్యులు తయారుచేసిన ద్రావణంలో మాస్కులను అరగంట వేడిచేసి ఆరబెట్టాలి. తర్వాత మాస్కులు వాడటం ద్వారా దగ్గు, జలుబు, ఆయా సం ఉన్నవారిపై వైరస్‌ ప్రభావం వెంటనే పడకుండా అడ్డుకుంటుంది. మాస్కును వారంపాటు వాడుకోవచ్చు. మాస్కుల కోసం 8790990606, 9848488894లలో సంప్రదించవచ్చు.


logo