ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 31, 2020 , 20:33:16

మూసీలో టోర్నడో.. ఆకాశంలో అద్భుతం

మూసీలో టోర్నడో.. ఆకాశంలో అద్భుతం

యాదాద్రి భువనగిరి : ఆకాశంలో అద్భుతం చోటు చేసుకుంది. మునుపెన్నడూ చూడని అరుదైన దృశ్యం స్థానిక ప్రజల్ని అబ్బురపరిచింది. వలిగొండ(మ) నెమలి కాల్వ నాగారం గ్రామాల మధ్య మూసి కాల్వ కత్వా పైన నీళ్ల సుడిగుండాలు తిరుగుతూ ఆకాశంలోకి ఎగసిన దృశ్యం కనులవిందు కలిగించింది. ఆకాశంలోని మేఘాలు ఒక్కసారిగి చుట్టి ముట్టి చెరువులో సుడిగుండంలా తిరుగుతూ నింగికేగిసిన అరుదైన దృశ్యాలు అబ్బురపరిచాయి. విదేశాల్లోలాగా బీభత్సం సృష్టించకపోయినా.. ఈ టోర్నడో స్థానికులను ఆశ్యర్యంతో పాటు ఒకింత ఆందోళన కలిగించింది.

మామూలుగా సముద్ర తీరాల్లో  ఇలాంటి  ఘటనలు  చేసుకుంటాయి. కానీ  మూసి నది పైన  ఇలాంటి   దృశ్యం చోటుచేసుకోవడం ఆశ్చర్యకరం. నలువైపులా గాలి ఒక్కసారిగా వచ్చినపుడు  ఇలాంటి  దానికి నీరు తోడైనపుడు ఇలాంటివి చోటుచేసుకుంటాయి. సముద్ర తీరంలో ఎత్తు ప్రదేశాల్లో, సంగమ ప్రాంతాల్లో ఇవి సహజం. సాయంత్రం 6.30 నిమిషాలకు  ఈ  అపురూప దృశ్యం చోటుచేసుకుంది. ట్రాక్టర్ తో పొలం దున్నుతున్న  డ్రైవర్ తన సెల్ ఫోన్ లో ఈ దృశాలను  బంధించాడు.ఇప్పుడు ఈ వీడియోలు  సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.logo