శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Aug 29, 2020 , 12:04:50

ఆకాశంలో అద్భుతం.. సూర్యుడి చుట్టూ సింగిడి

ఆకాశంలో అద్భుతం.. సూర్యుడి చుట్టూ సింగిడి

సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం ఉదయం 10.30 నుంచి 12.30గంటల వరకు సూర్యుడి చుట్టూ వలయం కనిపించింది. ఇంధ్రదనస్సులోని వర్ణాల తరహాలో భానుడి చుట్టూ ఈ వలయం ఏర్పడింది. దీంతో జిల్లాకేంద్రంలో పలువురు ఆసక్తిగా తిలకించారు. సూర్యుడి చుట్టూ ఇంద్రధనస్సులా ఏర్పడిన వలయాన్ని ‘హ్యాలో సినామినా’ అని పిలుస్తారని నిపుణులు పేర్కొంటున్నారు. ఆకాశంలో మేఘాలు ఎక్కువగా ఉన్న సమయంలో వాటిలోని నీటి బిందువులపై పడిన కాంతి కిరణాలు వక్రీభవనం చెందడం వల్ల ఈ తరహా వలయాలు ఏర్పడతాయని వాతావరణ శాఖ నిపుణులు పేర్కొంటున్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.logo