శనివారం 30 మే 2020
Telangana - Apr 01, 2020 , 01:23:21

కరోనా హెల్మెట్లతో అవగాహన

కరోనా హెల్మెట్లతో అవగాహన

-అనవసరంగా రోడ్లపైకి వస్తే వాహనాలు సీజ్‌

-సీపీ అంజనీకుమార్‌

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కరోనాను కట్టడి చేయాలంటే భౌతికంగా ఒకరికొకరు దూరంగా ఉండాలని, లాక్‌డౌన్‌కు సహకరించాలని హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ సూచించారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టడంలో భాగంగా మంగళవారం కరోనా ఆకారంలో ఉన్న హెల్మెట్లు ధరించిన పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమాన్ని మోజంజాహీ మార్కెట్‌ వద్ద సీపీ అంజనీకుమార్‌ జెండాఊపి ప్రారంభించారు.

15వరకు పాసుల గడువు

ట్రై పోలీస్‌ కమిషనరేట్లలో జారీచేసిన పాసుల గడువును ఈనెల 15 వరకు పొగిస్తున్నట్లు సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. ఇప్పటికే తీసుకున్న పాసులు రెన్యూవల్‌ చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇదిలాఉండగా నార్త్‌జోన్‌లో చెక్‌పోస్టును ఏర్పాటు చేశామని, ప్రతి వాహనం తనిఖీ చేసి వదులుతున్మాని సీపీ వెల్లడించారు.

అయ్యో..పాపం 

  • ఒంటరిగా ఉండడంతో మానసిక వేదనకు గురై.. రాజేంద్రనగర్‌లోని జనప్రియ ఉటోపియాలో నివాసం ఉంటున్న వైద్యుడు మృత్యుంజయ(57) గొంతు  కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. l కూకట్‌పల్లి కైత్లాపూర్‌లోని డంపింగ్‌ యార్డులో మంగళవారం అగ్ని ప్రమాదం జరిగి చెత్త తరలించే వాహనాలకు మంటలు అంటుకొని దగ్ధమయ్యాయి.
  • ముషీరాబాద్‌ బోయగుడకు చెందిన ఐదుగురు యువకులు కలిసి వివిధ ప్రాంతాల్లో ఆరు ద్విచక్ర వాహనాలను చోరీ చేశారు. వీరిని పోలీసులు అరెస్టు చేశారు. 
  • బాలాపూర్‌ శ్రీరామకాలనీకి చెందిన కూలీ వరికాల శ్రీనివాస్‌(50) మద్యం కోసం బయట తిరిగి వడదెబ్బకు మృతి చెందాడు
  • మల్లేపల్లి గటాల మసీదు వద్ద సాధిక్‌(28) విద్యుత్‌ స్తంభంపై మరమ్మతులు చేస్తుండగా షాక్‌ తగిలి కిందపడి మరణించాడు. 
  • గుడిమల్కాపూర్‌కు చెందిన సంతోష్‌కుమార్‌ మేడ్చల్‌ జిల్లా కిష్టాపూర్‌ గ్రామంలోని నీటి గుంతలో పడి మృతి చెందాడు.


logo