శనివారం 06 జూన్ 2020
Telangana - May 04, 2020 , 21:22:56

నిర్లక్ష్యం చేస్తే చస్తావ్‌.. కరోనాపై అవగాహన

నిర్లక్ష్యం చేస్తే చస్తావ్‌.. కరోనాపై అవగాహన

రాజన్న సిరిసిల్ల : కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య ఆధ్వర్యంలో సోమవారం వినూత్న ప్రచార అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌చౌక్‌, గాంధీచౌక్‌లో అకారణంగా రోడ్లపైకి వచ్చిన వాహనదారులను యముడు, చిత్రగుప్తుడి వేషధారణలో ఉన్న కళాకారులు ఆపుతూ కరోనా వైరస్‌ వల్ల కలిగే నష్టాన్ని వివరించారు. ప్రమాదకరమైన కరోనా వైరస్‌ను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోతాయని హెచ్చరించారు. కళాకారుల బృందాన్ని పట్టణ సీఐ వెంకటనర్సయ్య అభినందించారు. logo