సోమవారం 18 జనవరి 2021
Telangana - Dec 24, 2020 , 16:47:54

లేబర్‌ కార్డులపై అవగాహన కల్పించాలి

లేబర్‌ కార్డులపై అవగాహన కల్పించాలి

వికారాబాద్‌ : లేబర్‌ కార్డులపై భవన నిర్మాణ కార్మికులకు అవగాహన కల్పించాలని వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ అన్నారు. భవన నిర్మాణ కార్మికులకు లేబర్‌ కార్డుల కోసం జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ కృషి చేస్తున్న ‘జన్‌ సాహస్‌’ సంస్థ సేవలు అభినందనీయమన్నారు. గురువారం ధారూరు మండల పరిధిలోని నాగారంలో జన్‌ సాహస్‌ సంస్థ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులకు లేబర్‌ కార్డులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవన నిర్మాణ రంగంలో పని చేసే కార్మికుడు లేబర్‌కార్డును పొందాలని తెలిపారు. గుర్తింపుకార్డు ఉండటంతో ప్రభుత్వం ద్వారా బీమా పొందవచ్చన్నారు.

ప్రభుత్వం ద్వారా కార్డు పొందితే కుటుంబంలో  ఆడబిడ్డల పెండ్లిళ్లకు రూ.30 వేలు వస్తాయని తెలిపారు. ఇద్దరు కుతూళ్ల, రెండు కాన్పులకు రూ.30 వేలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.6లక్షల బీమా వర్తిస్తుందని పేర్కొన్నారు. శాశ్వత అంగవైకల్యం ఏర్పడితే రూ.5 లక్షల బీమా వర్తిస్తుందని తెలిపారు. సహజ మరణానికి రూ. 1,30,000 రూపాయలు ప్రభుత్వం అందుతుందన్నారు. అవకశాన్ని ప్రతి ఒక్కరు సద్వనియోగం చేసుకోవాలని సూచించారుప కార్యక్రమంలో జన్‌ సాహస్‌ కోఆర్డినేటర్‌ ప్రకాష్‌కుమార్‌, ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ సుజాత, పీఎసీఎస్‌ చైర్మన్‌ సత్యనారాయణరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాములు తదితరులు పాల్గొన్నారు.