శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Oct 05, 2020 , 01:47:29

రాజ్‌భవన్‌కు గులాబీ కాంతులు

రాజ్‌భవన్‌కు గులాబీ కాంతులు

  • 31న బ్రెస్ట్‌ క్యాన్సర్‌పై అవగాహన

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: బ్రెస్ట్‌ క్యాన్సర్‌పై అవగాహనలో భాగంగా అక్టోబర్‌ చివరి రోజున రాజ్‌భవన్‌ గులాబీ కాంతులు వెదజల్లేలా లైటింగ్‌ ఏర్పాటు చేయనున్నట్టు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ తెలిపారు. ఇంటర్నేషనల్‌ బ్రెస్ట్‌ క్యాన్సర్‌ అవేర్‌నెస్‌ నెల సందర్భంగా ఉషాలక్ష్మి బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌ ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆమె ప్రసంగించారు. 13 ఏండ్ల నుంచి బ్రెస్ట్‌ క్యాన్సర్‌పై అవగాహన కల్పనకు కృషిచేస్తున్నందుకు ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ రఘురాంను ప్రశంసించారు. కేంద్ర ఆరోగ్యశాఖ మాజీ కార్యదర్శి సుజాతరావు మాట్లాడుతూ.. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ అనేది మహిళలకు వచ్చే సాధారణ క్యాన్సర్‌ వంటిదని, త్వరగా గుర్తించి, చికిత్స ప్రారంభిస్తే ఎంతోమంది ప్రాణాలు కాపాడవచ్చని అన్నారు. ఫౌండేషన్‌ సేవలను ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌ కొనియాడారు. కిమ్స్‌ ఎండీ బీ భాస్కర్‌రావు మాట్లాడుతూ.. అక్టోబర్‌ నెలలో జర్నలిస్టుల జీవిత భాగస్వామికి (40 ఏండ్లపై బడిన) కిమ్స్‌-ఉషాలక్ష్మి సెంటర్‌లో ఉచితంగా స్క్రీనింగ్‌ మమ్మొగ్రామ్‌ సేవలందిస్తామని ప్రకటించారు.