గురువారం 28 మే 2020
Telangana - May 17, 2020 , 02:00:59

రచయిత వాడ్రేవుకు పురస్కారం

రచయిత వాడ్రేవుకు పురస్కారం

వరంగల్‌ కల్చర ల్‌:  ప్రముఖ సాహితీవేత్త, రచయిత, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సర్వశిక్షా అభియాన్‌ డైరెక్టర్‌, పశ్చిమ గో దావరి జిల్లాకు చెందిన వాడ్రేవు చినవీరభద్రుడికి సహృదయానుబంధ పురస్కా రం అందజేస్తున్నట్లు సహృదయ సాహి త్య సాంస్కృతిక సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు గిరిజా మనోహర్‌బాబు, డాక్టర్‌ ఎన్వీఎన్‌చారి శనివారం తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన శతావధాని, కవి డాక్టర్‌ రాళ్లబండి కవితాప్రసాద్‌ జయంతిని పురస్కరించుకొని ఏటా మే 21న సాహితీరంగంలో కృషి చేసిన ఏదేని ప్రభుత్వ శాఖలోని విభాగానికి పరిపాలనాధికారిగా పనిచేసిన వారికి సంస్థ తరఫున ఈ అ వార్డును అందజేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.  కరోనా నేపథ్యంలో కార్యక్రం వాయిదా వేశామని, వివరాలు త్వరలో తెలియజేస్తామన్నారు.logo