గురువారం 21 జనవరి 2021
Telangana - Dec 30, 2020 , 15:23:43

కల్లుతో పలు వ్యాధులు దూరం : మంత్రులు

కల్లుతో పలు వ్యాధులు దూరం : మంత్రులు

నాగర్‌కర్నూల్ : కల్లు ప్రకృతి ప్రసాదించిన వరమని ఎక్సైజ్ శాఖ మంత్రి పి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లాలోని నాగర్‌కర్నూల్, తెలకపల్లి ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయాలను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ..క్యాన్సర్, కిడ్నీ, బీపీలాంటి వ్యాధులకు, అమ్మవారు వచ్చినా కల్లు ఔషధంగా పని చేస్తుందన్నారు. రూ.3.70కోట్ల ఈత మొక్కలను నాటాం. హైదరాబాద్‌లో నీరా కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు.

 సాంప్రదాయ నీరా పాలసీ తీసుకొచ్చాం. ఒక్క మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాలోనే రూ.150, 200కోట్లు వెచ్చిస్తున్నామని తెలిపారు. చదువుతోనే అభివృద్ధి అని నాడే అంబేద్కర్, పూలే చెప్పారు. వారి స్ఫూర్తితో తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మెరుగైన విద్యను అందిస్తుందన్నారు. ఫిబ్రవరిలో ఉద్యోగాల నియామకాలు చేపడుతామని స్పష్టం చేశారు. మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ..ఫిబ్రవరి నుంచి 70వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ల జారీ చేస్తామన్నారు. ప్రపంచంలో 158 రకాల స్కిల్డ్ పనులు ఉన్నాయి. కేటీఆర్ కృషివల్ల 7 లక్షల మందికి ఐటీ ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు.


వ్యవసాయం ప్రపంచానికి అన్నం పెట్టే రంగం. ఎకరం సాగు చేసి నాలుగైదు లక్షలు సంపాదించుకోవచ్చని సూచించారు. అలాగే వ్యవసాయ శాఖను ఆధునీకరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మరో నాలుగైదు ఏళ్లల్లో రైతులకు ఆడపిల్లలను ఇచ్చి పెండ్లిళ్లు చేసే పరిస్థితులు ఏర్పడ్డతాయని చెప్పారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న, జడ్పీ చైర్మన్ పద్మావతి, జిల్లా కలెక్టర్ ఎల్. శర్మన్, డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి బైకని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
logo