శుక్రవారం 23 అక్టోబర్ 2020
Telangana - Sep 29, 2020 , 17:30:35

నాకు ప్రాణ హాని ఉంది : అవంతి

నాకు ప్రాణ హాని ఉంది : అవంతి

హైద‌రాబాద్ : హేమంత్ హ‌త్య కేసులో అవంతి, ఆమె అత్త‌మామ‌ల విచార‌ణ ముగిసింది. గ‌చ్చిబౌలి పోలీసులు సుమారు 6 గంట‌ల పాటు విచార‌ణ చేసి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. హేమంత్ హ‌త్య‌కు ముందు, హ‌త్య త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌పై అవంతితో పాటు హేమంత్ కుటుంబ స‌భ్యుల స్టేట్‌మెంట్ రికార్డు చేశారు పోలీసులు. 

విచార‌ణ ముగిసిన అనంత‌రం అవంతి మీడియాతో మాట్లాడారు. త‌న భ‌ర్త హేమంత్ హ‌త్య కేసులో త‌న‌ను విచారించి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. త‌న‌కున్న అనుమానాలను పోలీసుల దృష్టికి తీసుకెళ్లాను. త‌న‌కు ప్రాణ హాని ఉంది. త‌న భ‌ద్ర‌త‌పై పోలీసులు హామీ ఇచ్చారు. నిందితుల‌కు బెయిల్ రాకుండా పోరాటం చేస్తాను అని స్ప‌ష్టం చేశారు. మా మామ‌కు బెదిరింపు కాల్స్ వ‌చ్చాయి. ఆ కాల్స్ ఆడియోలు పోలీసుల‌కు అంద‌జేశామ‌ని అవంతి తెలిపారు. 


logo