మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Sep 25, 2020 , 12:04:11

నన్ను చంపాల్సి ఉండే.. మా నాన్న‌కు మారుతీరావు గ‌తే

నన్ను చంపాల్సి ఉండే.. మా నాన్న‌కు మారుతీరావు గ‌తే

హైద‌రాబాద్ : కులాంత‌ర వివాహం ఓ నిండు ప్రాణాన్ని బ‌లితీసుకుంది. గ‌చ్చిబౌలిలో ఉంటున్న హేమంత్ అనే యువ‌కుడిని అతని భార్య బంధువులు దారుణంగా హ‌త్య చేసిన విష‌యం విదిత‌మే. ఈ సంద‌ర్భంగా హేమంత్ భార్య అవంతి మీడియాతో మాట్లాడుతూ.. మా నాన్న ప‌రువును నేను తీసినందుకు.. న‌న్ను చంపాల్సి ఉండే. హేమంత్‌ను చంపే హ‌క్కు మా నాన్న‌కు ఎక్క‌డిది? నాన్న ల‌క్ష్మారెడ్డికి మారుతీరావు గ‌తే ప‌డుతుంది. ప్ర‌ణ‌య్‌ను చంపిన మారుతీరావు ఏమ‌య్యాడో తెలుసు క‌దా? నేను హేమంత్ గ‌త ఎనిమిదేండ్ల నుంచి ప్రేమించుకుంటున్నాం. మా ప్రేమ తెలిసి ఏడు నెల‌ల పాటు న‌న్ను ఇంట్లోనే బంధించారు. మొత్తానికి ఈ ఏడాది జూన్ 10న హేమంత్ నేను ప్రేమ వివాహం చేసుకున్నాం. అంత‌లోనే ఈ ఘోరం జ‌రిగింది. హేమంత్‌ను అత్త‌య్య‌, మామ‌య్య‌లు బాగా చూసుకుంటారు. న‌న్ను కూడా ఎంతో ప్రేమ‌గా చూసుకునేవారు. 

అయితే పెళ్లి అయిన త‌ర్వాత నా పేర ఉన్న ఆస్తుల‌న్నీ నాన్న పేరు మీద‌నే రాసిచ్చాను. పోలీసుల స‌మ‌క్షంలో సెటిల్‌మెంట్ చేసుకున్నాం. కానీ ఇలాంటి ఘోరం జ‌రుగుతుంద‌ని ఊహించ‌లేదు. హేమంత్‌ను మా మేన‌మామ‌నే హ‌త్య చేశాడు అని అవంతి పేర్కొన్నారు. 


logo