శనివారం 06 మార్చి 2021
Telangana - Jan 22, 2021 , 18:59:52

అందుబాటులో ఇసుక : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

అందుబాటులో ఇసుక : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్ : ప్రస్తుతం ఇసుక కొరత లేదని, అన్ని రిజర్వాయర్లలో అందుబాటులో ఉందని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బండమీదిపల్లిలో ఖనిజాభివృద్ధి సంస్థ  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇసుక ఉప కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిర్మాణ రంగాల్లో ఇసుక ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. దళారుల రంగప్రవేశం, బ్లాక్‌ చేయడంతో ఇసుకకు విపరీతమైన డిమాండ్‌ పెరిగిందని, ప్రభుత్వ పనులతోపాటు ప్రైవేటు వ్యక్తులకు అందడం కష్టంగా మారిందన్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సామాన్యులకు తక్కువ ధరకు ఇసుకను అందించేందుకే ఆన్‌లైన్‌ విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. 

అవసరమైన వారు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోగానే టిప్పర్‌ ద్వారా నేరుగా ఇంటికి వచ్చేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.  ఒక టన్నుకు రూ.900  చెల్లించాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ శ్రీనివాస్‌, మున్సిపల్‌ చైర్మన్‌ నర్సింహులు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌, డీసీసీబీ ఉపాధ్యక్షుడు కొరమోని వెంకటయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రదీప్‌కుమార్‌, నాయకులు పాల్గొన్నారు. 

ఇవి కూడా చదవండి..

ఇద్దరు పిల్లలతో తల్లి అదృశ్యం?

కిలిమంజారోను అధిరోహించిన అన్వితా రెడ్డి

ఏసీబీ వలలో ప్రభుత్వ ఉద్యోగి

ఐటీ హబ్‌తో మెరుగైన ఉపాధి : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

చేసిన అభివృద్ధిని చెబుదాం..టీఆర్‌ఎస్‌ను గెలిపిద్దాం

ఫైనాన్స్ కంపెనీ వేధింపులు..ఆటోకు నిప్పు పెట్టిన బాధితుడు 


VIDEOS

logo