బుధవారం 03 జూన్ 2020
Telangana - Feb 12, 2020 , 00:04:27

ఆటో-లారీ ఢీ: ముగ్గురి దుర్మరణం

ఆటో-లారీ ఢీ: ముగ్గురి దుర్మరణం

హసన్‌పర్తి: అతివేగంతో వస్తున్న గ్రానైట్‌ లారీ అదుపుతప్పి ఆటోను ఢీకొట్టిన ఘటనలో ఆటో లో ప్రయాణిస్తున్న ముగ్గురు దుర్మరణం చెంద గా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘ టన మంగళవారం వరంగల్‌ అర్బన్‌ జిల్లా హసన్‌పర్తి సమీపంలో చోటుచేసుకున్నది. ఎస్సై శ్రీధర్‌రావు కథనం ప్రకారం.. హన్మకొండ నుంచి కరీంనగర్‌ వైపు వెళ్తున్న గ్రానైట్‌ లారీ ఎల్కతుర్తి నుంచి హన్మకొండకు వెళ్తున్న ప్యాసింజర్‌ ఆటో ను వేగంగా ఢీకొట్టింది. 


ప్రమాదంలో హసన్‌పర్తికి చెందిన అటికేటి గట్టమ్మ(50), ఎల్కతుర్తి మండలం బావుపేటకు చెందిన మర్రి శ్రీకాంత్‌యాదవ్‌ (21) అక్కడికక్కడే మృతిచెందగా, వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్ధన్నపేటకు చెందిన కలకోట్ల శ్రావణి(21) దవాఖానకు తరలిస్తుండగా చనిపోయింది. ఎల్కతుర్తి మండలం బావుపేటకు చెందిన ఆటోడ్రైవర్‌ తాళ్లపెల్లి అరుణ్‌తోపాటు హసన్‌పర్తికి చెందిన శీలం నవ్య, ఎల్లాపూర్‌కు చెందిన ఎర్ర సరోజనకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను వరంగల్‌ ఎంజీఎం దవాఖానకు తరలించారు. వరంగల్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ విశ్వనాథ రవీందర్‌, ప్రొబేషనరీ ఐపీఎస్‌ యోగేశ్‌ గౌతం, ఏసీపీ రవీందర్‌ ఘటనాస్థలికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు.  


logo