గురువారం 28 మే 2020
Telangana - May 22, 2020 , 08:41:00

ఫిట్స్ తో కుప్పకూలి ఆటోడ్రైవర్ మృతి

ఫిట్స్ తో కుప్పకూలి ఆటోడ్రైవర్ మృతి

మెహిదీపట్నం :  మూర్ఛవచ్చి ఓ ఆటో డ్రైవర్‌ మృతి చెందాడు. ఈ సంఘటన ఆసిఫ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. ఆసిఫ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ నూతన భవనం సమీపం సందులోని ఓ అరుగుపై గురువారం ఉదయం ఓ వ్యక్తి పడి ఉండగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.  పోలీసులు వచ్చి అతడిని పరీక్షించగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. 

అతని వివరాలు సేకరించగా..  ఎంఎం పహాడీకి చెందిన ఆటో డ్రైవర్‌  సల్మాన్‌ ఖాన్‌ (25)గా గుర్తించారు. ఫిట్స్‌తోనే అతను మృతి చెంది ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. ఉస్మానియా మార్చురీలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo