గురువారం 09 ఏప్రిల్ 2020
Telangana - Mar 08, 2020 , 01:27:10

పొలంలో జింక కళేబరం

పొలంలో జింక కళేబరం
  • స్వాధీనం చేసుకున్న అటవీ అధికారులు

వికారాబాద్‌టౌన్‌: వికారాబాద్‌ జిల్లా కేంద్రం కొత్రేపల్లి రెవెన్యూ పరిధిలో శనివారం ఓ రైతు పొలంలో నుంచి జింక కళేబరాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రైతు షబ్బీర్‌కు తన పొలంలో శనివారం మధ్యాహ్నం జింక కళేబరం కనిపించడంతో వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించాడు. సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఆ కళేబరాన్ని తరలించారు. పొలం యజమాని షబ్బీర్‌ మాట్లాడుతూ.. ప్రతి శని, ఆదివారాల్లో సమీపంలోని పలు ఫాంహౌజ్‌లతోపాటు, దామగుండం అటవీ ప్రాంతంలో తుపాకులతో వేటాడిన శబ్దాలు వినిపిస్తున్నాయని తెలిపాడు. ఎక్కడో జింకను చంపి తమ పొలంలో వేశారని, ఇది ఎవరో కావాలనే చేసిన పని అని ఆయన పేర్కొన్నారు. పలువురు ఫాంహౌజ్‌లలో నీటిని ఏర్పాటు చేసి తాగేందుకు వచ్చిన మూగ జీవాలకు వేటాడుతున్నారని తెలిపాడు. అటవీ అధికారులు స్పందిస్తూ.. జింక రెండురోజుల కిందటే మృతి చెంది ఉంటుందన్నారు. ఈ విషయమై పొలం యజమానితోపాటు పక్క భూమి యజమానిని కూడా విచారిస్తామన్నారు. 


logo