శుక్రవారం 03 జూలై 2020
Telangana - Jun 17, 2020 , 10:36:39

మలేరియా నివారణకు అధికారుల చర్యలు

మలేరియా నివారణకు అధికారుల చర్యలు

ఆదిలాబాద్ : వానకాలం సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా వైద్య శాఖ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఎక్కువగా మలేరియా వ్యాధి ప్రభావం ఉండే ప్రమాదం ఉండడంతో ఈ దిశగా చర్యలు చేపట్టారు. ప్రజలు తమ ఇంటి పరిసరాల్లో మురికి నీరు, చెత్తాచెదారం నిల్వ ఉంచకుండా అవగాహన కల్పిస్తున్నారు.

మురికి కాలువలు శుభ్రం చేయడంతోపాటు దోమల నివారణ మందులను పిచికారీ చేస్తున్నారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలకు దోమల నుంచి రక్షణ పొందేందుకు 75వేల దోమ తెరల పంపిణీకి శ్రీకారం చుట్టారు. దోమలను అరికట్టేందుకు ప్రత్యేకించి రూపొందించిన కెమికల్ కోటెడ్ బెడ్ షీట్స్ అందిస్తున్నారు. ఈ దోమ తెరల వల్ల ప్రజలకు పూర్తి రక్షణ ఉంటుందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మిశ్రా తెలిపారు.


logo