ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Oct 27, 2020 , 15:35:18

అర‌బిందో ఫార్మా రూ. 5 కోట్ల విరాళం

అర‌బిందో ఫార్మా రూ. 5 కోట్ల విరాళం

హైద‌రాబాద్ : ‌హైద‌ర‌బాద్ వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకునేందుకు అర‌బిందో ఫార్మా కంపెనీ ముందుకు వ‌చ్చింది. వ‌ర‌ద బాధితులకు స‌హాయ‌క చ‌ర్య‌ల కోసం అర‌బిందో ఫార్మా రూ. 5 కోట్ల విరాళం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో మంత్రి కేటీఆర్‌ను అరబిందో ఫార్మా కంపెనీ ప్ర‌తినిధులు క‌లిసి చెక్కును అంద‌జేశారు. 

మీనాక్షి ఇన్‌ఫ్రాస్ర్ట‌క్చ‌ర్స్ ప్ర‌యివేటు లిమిటెడ్ కంపెనీ కూడా ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి రూ. 2 కోట్ల విరాళం ప్ర‌క‌టించింది. ఈ కంపెనీ ప్ర‌తినిధులు కూడా కేటీఆర్‌కు చెక్కు అంద‌జేశారు. అర‌బిందో ఫార్మా, మీనాక్షి ఇన్‌ఫ్రాస్ర్ట‌క్చ‌ర్స్ ప్ర‌యివేటు లిమిటెడ్ కంపెనీ ప్ర‌తినిధుల‌కు కేటీఆర్ ధ‌న్య‌వాదాలు తెలిపారు.