శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Sep 04, 2020 , 18:51:22

కన్న కూతుళ్లను కడతేర్చే యత్నం..

కన్న కూతుళ్లను కడతేర్చే యత్నం..

మహబూబ్ నగర్ : ముక్కుపచ్చలారని కన్నబిడ్డలను అమానవీయంగా కడతేర్చాలని చూశాడు ఓ తండ్రి. ఈ అమానవీయ ఘటన జిల్లా లోని గండీడ్ మండలం దేశాయిపేటలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. దేశాయిపేట గ్రామానికి చెందిన కృష్ణవేణి, కేశవులు దంపతులకు అప్పటికే ఓ ఆడపిల్ల ఉంది. కాగా, కృష్ణవేణి మరోసారి డెలివరీ కోసం నారాయణపేట జిల్లా కోసిగి మండల కేంద్రంలోని ప్రైవేటు నర్సింగ్ హోమ్ లో చేరింది. 

ఈ నెల 1వ తేదీన కృష్ణవేణి ఇద్దరు ఆడపిల్లలను ప్రసవించింది. మగ పిల్లవాడు పుట్టలేదని.. ముగ్గురు ఆడపిల్లలను పోషించ లేనని మనస్థాపంతో పుట్టిన ఆడ పిల్లల నోట్లో పురుగుల మందు పోసి కేశవులు పారిపోయాడు. విషయాన్ని గమనించిన భార్య కృష్ణవేణి వెంటనే వైద్యులకు తెలిపింది. వైద్యులు చిన్నపిల్లలను మెరుగైన చికిత్స కోసం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోమ్ కు తరలించారు. పరారీలో ఉన్న కేశవులు ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపినట్లు కోస్గి సీఐ ప్రేమ్ కుమార్ తెలిపారు.


logo