శనివారం 23 జనవరి 2021
Telangana - Nov 28, 2020 , 01:23:12

ప్రలోభాలకు తెరలేపిన బీజేపీ

ప్రలోభాలకు తెరలేపిన బీజేపీ

  • ఓటర్లకు మద్యం పంపిణీ చేసేందుకు యత్నం
  • లక్ష విలువైన మద్యాన్ని పట్టుకున్న పోలీసులు

రామచంద్రాపురం: గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ ప్రలోభాల పర్వానికి తెరలేపింది. ఆర్సీపురం బీజేపీ కార్పొరేటర్‌ అభ్యర్థి అనుచరులు ఓటర్లకు మద్యం పంచేందుకు యత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇన్‌స్పెక్టర్‌ జగదీశ్వర్‌ వివరాల ప్రకారం.. ఆర్సీపురం 112 డివిజన్‌ బీజేపీ కార్పొరేటర్‌ అభ్యర్థి నర్సింగ్‌గౌడ్‌ తరఫున ఆయన అనుచరులు శ్రీకాంత్‌రెడ్డి, రాం రెడ్డి నర్సింహారెడ్డి, జంగారెడ్డి, ప్రవీణ్‌రెడ్డి శుక్రవారం కారులో మద్యాన్ని తరలిస్తున్నారని పోలీసులకు  సమాచారం అందింది. పోలీసులు ఆ కారును పట్టుకొని నలుగురిని అరెస్టుచేశారు. కారులో ఉన్న 48 సిగ్నేచర్‌ ఫుల్‌బాటిళ్లు, 192 రాయల్‌స్టాగ్‌ క్వార్టర్‌ బాటిళ్లను స్వాధీనం చేసుకు న్నారు. మద్యం విలువ సుమారు రూ.లక్ష ఉంటుందని పోలీసులు తెలిపారు.logo