శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 02, 2020 , 21:33:21

ఎమ్మెల్యే క్రాంతిపై దాడికి యత్నం.. సిద్దిపేటలో స్వల్ప ఉద్రిక్తత

ఎమ్మెల్యే క్రాంతిపై దాడికి యత్నం..  సిద్దిపేటలో స్వల్ప ఉద్రిక్తత

దుబ్బాక : మరికొన్నిగంటల్లో దుబ్బాక ఉప ఎన్నికల జరగనున్న నేపథ్యంలో సిద్దిపేటలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం బీజేపీ కార్యకర్తలు ఏకంగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపైనే దాడికి ప్రయత్నించారు. పట్టణంలోని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్‌లోకి బీజేపీ కార్యకర్తలు దూసుకెళ్లారు. ఈ క్రమంలో ఆందోళ్‌ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌పై దాడికి యత్నించారు. వారిని నిలువరించిన పలువురు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడంతో గాయపడినట్లు తెలుస్తోంది. 

ఉద్దేశపూర్వకంగానే దాడికి యత్నం : ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌

దుబ్బాక ఉప ఎన్నికలలో ఓటమి ఖాయమని తేలడంతో బీజేపీ పథకం ప్రకారమే ఘర్షణ వాతావరణాన్ని సృష్టించేందుకు యత్నిస్తున్నదని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ అన్నారు. ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేయాలనే లక్ష్యంతోనే తమపై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు. బీజేపీ తీరుపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.