గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 25, 2020 , 06:41:32

జర్నలిస్టులపై దాడులు తగదు

జర్నలిస్టులపై దాడులు తగదు

ఖైరతాబాద్‌: కరోనా వ్యాధి నియంత్రణ కోసం ప్రజలను జాగృతం చేస్తూ ప్రాణాలను తెగించి విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులపై పోలీసులు దాడులు చేయడం తగదని హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌. విజయ్‌ కుమార్‌ రెడ్డి, బి. రాజమౌళిచారి ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి మీడియాకు మినహాయింపు ఇచ్చిన 24గంటల్లోనే అంబర్‌పేట, బేగంపేట తదితర ప్రాంతాల్లో మీడియా ప్రతినిధులపై విచక్షణారహితంగా ప్రవర్తించడం బాధాకరమన్నారు.

ప్రపంచమే వణికిపోతున్న ఆపద సమయంలో తెలంగాణ సమాజంలో కొత్త సమస్యలు తెచ్చేలా వ్యహరించారన్నారు. ఈ రకమైన వ్యవహారం మానవ సమాజానికి శ్రేయస్కరం కాదన్నారు. జర్నలిస్టులపై దాడులకు పాల్పడిన వారిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని విజయ్‌ కుమార్‌ రెడ్డి, రాజమౌళిచారి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు డీజీపీకి వినతిపత్రం పంపించామని తెలిపారు.


logo
>>>>>>