సోమవారం 25 జనవరి 2021
Telangana - Aug 19, 2020 , 02:32:12

బాలికలపై దాడులను ఉపేక్షించం: సత్యవతి రాథోడ్‌

బాలికలపై దాడులను ఉపేక్షించం:  సత్యవతి రాథోడ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మహిళలు, బాలికలపై దాడులను ఉపేక్షించబోమని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ హెచ్చరించారు. ఆడబిడ్డలకు అండగా కేసీఆర్‌ సర్కారు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదన్నారు. అమీన్‌పూర్‌ బాలల సంరక్షణ కేంద్రంలో 14 ఏండ్ల బాలికపై లైంగికదాడి, మృతి ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టినట్టు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు ప్రత్యేకంగా కమిటీని వేసినట్టు పేర్కొన్నారు. ముగ్గురు ప్రధాన నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేశారని వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రైవేటు బాలల సంరక్షణ కేంద్రాల్లో విధిగా సీసీటీవీల ఏర్పాటుకు ఆదేశించినట్టు తెలిపారు. 


logo