గురువారం 04 జూన్ 2020
Telangana - May 04, 2020 , 00:52:27

ఎక్సైజ్‌ అధికారులపై దాడులను సహించం

ఎక్సైజ్‌ అధికారులపై దాడులను సహించం

  • ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హెచ్చరిక

జడ్చర్ల రూరల్‌: నాటుసారా తయారీకి అడ్డుకట్ట వేస్తున్న ఎక్సైజ్‌ అధికారులపై ఎవరైనా దాడులకు పాల్పడితే సహించేదిలేదని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హెచ్చరించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలంలో శనివారం రాత్రి సారా తయారీ స్థావరాలపై దాడి చేసేందుకు వెళ్లిన జడ్చర్ల ఎక్సైజ్‌ సీఐ బాలోజీ, ఎస్సై ఉమామహేశ్వర్‌, కానిస్టేబుళ్లు సిద్దూ, వెంకటేశ్వర్లు, హెడ్‌కానిస్టేబుల్‌ రమేశ్‌పై కొందరు కర్రలతో దాడిచేసి గాయపర్చారు. విషయం తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆదివారం జడ్చర్ల ఎక్సైజ్‌ కార్యాలయాన్ని సందర్శించి క్షతగాత్రులను పరామర్శించారు. 


logo