శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 09, 2020 , 21:02:43

మంత్రాల నెపంతో మహిళపై దాడి...

మంత్రాల నెపంతో మహిళపై దాడి...

కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట రంగచారి కాలనిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఎర్రొల్ల లలిత అనే మహిళ తన ఇంట్లో పూజలు చేసుకుని, పూజ నీళ్లు ఇంటి పక్కన పోసింది. దీంతో మంత్రాలు చేసిన నీళ్లు పోస్తున్నావా అంటు పక్కింటి కుటుంబ సభ్యులు మహిళపై దాడి చేశారు. తీవ్రంగా గాయాలు కావడంతో స్థానికులు ఆమెను కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. 


logo