ఏపీలో కూల్చిన గుళ్లకు శంకుస్థాపన రేపు

హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): ఏపీ లో చంద్రబాబు హయాంలో కూల్చివేసిన ఆలయాల పునర్నిర్మాణానికి శుక్రవారం సీఎం జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేస్తారని ఆ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పారు. విజయవాడ లో కూల్చివేసిన దేవాలయాలు దక్షిణముఖ ఆంజనేయస్వామి, సీతమ్మవారి పాదాలు, రాహు-కేతు, బొడ్డుబొమ్మ, గోశాల కృష్ణుడి గుడి తదితర గుళ్లను పునర్నిర్మించనున్నట్టు తెలిపారు. రూ.70 కోట్లతో తలపెట్టిన దుర్గగుడి అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేస్తారన్నారు. 13 జిల్లాల్లో 40 దేవాలయాలను పునర్నిర్మించనున్నట్టు పేర్కొన్నారు.
ఏపీలో ఆధ్యాత్మిక కేంద్రాలపై నిఘా నేత్రం
ఏపీలోని ఆలయాలు, చర్చిలు, మసీదులు, ఇతర ఆధ్యాత్మికకేంద్రాలపై పోలీసులు నిఘా పెంచారు. ఇ ప్పటికే రామతీర్థం ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశించిన ఏపీ ప్రభుత్వం.. అన్ని ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా ఎస్పీలకు సీఎం జగన్ బుధవారం ఆదేశాలు జారీచేశారు.
ఏపీలో ఆలయాలపై దాడులు ఆపాలి
ఏపీ లో ఆలయాలపై, దేవుడి విగ్రహాలపై దాడులు ఆపాలని, లేనిపక్షంలో ధర్మ పరిరక్షణోద్యమం చేపడుతామని పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి హెచ్చరించారు. ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేయడం వల్ల సమాజంలో అశాంతి ప్రబలే ఆస్కారం ఉన్నదని చెప్పా రు. సమావేశంలో శృంగేరీ శారదాపీఠం ఆస్థాన పం డింతుడు బాచంపల్లి సంతోష్‌కుమార్ శాస్త్రి, కంచి కామకోటిపీఠం ఆస్థాన పండింతుడు చింతపల్లి సుబ్రమణ్య శర్మ, దేవాలయ ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షుడు వెంకటరమణ శర్మ పాల్గొన్నారు.
తాజావార్తలు
- కిసాన్ ర్యాలీ భగ్నానికి ఉగ్ర కుట్ర
- 'సర్కారు వారి పాట' ఖాతాలో సరికొత్త రికార్డ్
- రాజ్యాంగం అసలు కాపీని ఆ బాక్స్‌లో ఎందుకు ఉంచారో తెలుసా?
- ఎగిరే బల్లి..పొలంలో అలజడి
- ట్రంప్ కొత్త పార్టీ పెట్టడం లేదు..
- ఈ 'కుక్క' మాకూ కావాలి
- చైనాలో ఇంటర్నెట్ స్టార్ గా మారిన 4ఏళ్ల చిన్నారి, స్పేస్ సూట్ లో పీపీఈ కిట్
- కరోనా టీకా తీసుకున్న ఎమ్మెల్యే సంజయ్
- మురికివాడలో మెరిసిన ముత్యం..సెలబ్రిటీలను ఫిదా చేసిన మలీషా
- అమెరికాలో కాల్పులు.. గర్భిణి సహా ఐదుగురు మృతి