గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 14, 2020 , 03:33:46

ఎమ్మెల్యే నన్నపునేని ఇంటిపై దాడి

ఎమ్మెల్యే నన్నపునేని ఇంటిపై దాడి

  • బీజేపీ నేత ముసుగులో రాళ్లు రువ్విన రౌడీషీటర్‌

ఖిలావరంగల్‌: తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ ఇంటిపై ఓ రౌడీషీట ర్‌ దాడికి పాల్పడ్డాడు. బీజేపీ నేత ముసుగులో రాళ్లు రువ్వి భయానక వాతావరణాన్ని సృష్టించాడు. సోమవారం రాత్రి ఎమ్మెల్యే నరేందర్‌ ఇంటిపై బీజేపీ కార్యకర్తలు పరకాలకు చెందిన దుబాసి వాసుదేవ్‌, హన్మకొండకు చెందిన రావుల కిషన్‌తోపాటు కేయూసీ పోలీస్‌స్టేషన్‌ పరిధికి చెందిన రౌడీషీటర్‌ నాంపల్లి శ్రీనివాస్‌ రాళ్లతో దాడికి దిగారు. అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు అప్రమత్తమై వారిని ఠాణాకు తరలించారు. విషయం తెలుసుకున్న టీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీగా మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని నిరసన చేపట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఏసీపీ హామీ ఇవ్వడంతో వెనుదిరిగారు.

చీఫ్‌విప్‌ క్యాంపు ఆఫీస్‌పై కోడిగుడ్లతో దాడి

సుబేదారి/హన్మకొండ : హన్మకొండలోని వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే, చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ క్యాంపు కార్యాలయంపై బీజేపీ నాయకులు సోమవారం కోడిగుడ్లతో దాడి చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు సుబేదారి సీఐ అజయ్‌ తెలిపారు. 


logo