శనివారం 28 నవంబర్ 2020
Telangana - Nov 02, 2020 , 22:50:54

‘ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌పై దాడి అప్రజాస్వామికం’

‘ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌పై దాడి అప్రజాస్వామికం’

హైదరాబాద్‌ : జర్నలిస్టుగా కొనసాగి ఎమ్మెల్యే అయిన క్రాంతి కిరణ్‌పై బీజేపీ కార్యకర్తలు దాడి అప్రజాస్వామికమని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ సంఘం అభిప్రాయపడింది. దుబ్బాక ఉప ఎన్నికలపై అనేక టీవీ ఛానల్లో చర్చా వేదికలో పాల్గొంటూ ప్రత్యర్థి పార్టీలకు కొరకరాని కొయ్యగా తయారైన దళిత ఎమ్మెల్యే క్రాంతి బస చేస్తున్న హోటల్‌కు వచ్చి బీజేపీ కార్యకర్తలు ఆయనపై దాడికి చేయడాన్ని తీవ్రంగా ఖండించింది.  దుబ్బాక ఉపఎన్నికల్లో ఓటమి తప్పదని తెలుసుకున్న బీజేపీ నాయకులు దళిత ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంలపై దాడికి పాల్పడడం హేయమైన చర్యగా అభివర్ణించింది. దాడికి  పాల్పడిన బీజేపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని  టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీలు, తెంజు రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ ఇస్మాయిల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ.రమణ కుమార్, చిన్న పత్రికల సంఘం అధ్యక్షుడు యూసుఫ్ బాబు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు యోగానంద్, ప్రధాన కార్యదర్శి నవీన్‌ కుమార్ డిమాండ్ చేశారు. ఇలాంటి దాడుల సంస్కృతిని సహించేది లేదన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.