శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Sep 16, 2020 , 09:22:16

భూపాల‌ప‌ల్లిలో అటవీశాఖ సిబ్బందిపై దాడి

భూపాల‌ప‌ల్లిలో అటవీశాఖ సిబ్బందిపై దాడి

మహాముత్తారం: అటవీశాఖ శాఖ సిబ్బందిపై దాడి చేసిన ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. మహాముత్తారం మండలం పెగడపల్లికి చెందిన జాటోత్‌ ధరమ్‌సింగ్‌ ఇంట్లో అటవీ జంతువు మాంసం ఉంద‌నే సమాచారంతో ఇన్‌చార్జి రేంజర్‌ వీరన్న గ‌త సోమ‌వారం సిబ్బందితో కలిసివెళ్లగా.. ధరమ్‌సింగ్‌ కుటుంబ సభ్యులు వారిపై దాడిచేశా రు. సిబ్బంది మహమ్మద్‌ ఇబ్రహీంకు తీవ్ర రక్తస్రావం కావడంతో దవాఖానకు తరలించారు. పెగడపల్లి బీట్‌ ఆఫీసర్ ‌శ్యాం, రెడ్డిపల్లి బీట్‌ ఆఫీసర్‌ కిరణ్‌కు స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.  


logo