గురువారం 28 మే 2020
Telangana - May 03, 2020 , 15:38:55

ఎక్సైజ్‌ సిబ్బందిపై దాడి: సీఐతో సహా ఐదుగురికి గాయాలు

ఎక్సైజ్‌ సిబ్బందిపై దాడి: సీఐతో సహా ఐదుగురికి గాయాలు

మహబూబ్‌నగర్‌: జిల్లాలోని జడ్చర్ల మండలం ఒంటిగుట్ట తండా సారా బట్టిలపై ఎక్సైజ్‌ సిబ్బంది దాడులు నిర్వహించారు. సారా బట్టిల వద్ద ఉన్న నలుగురు వ్యక్తులు కర్రలతో ఎక్సైజ్‌ సిబ్బందిపై దాడి చేశారు. నాటుసారా తయారీదారుల దాడిలో సిబ్బందికి తీవ్రగాయాలయ్యాయి. ఎక్సైజ్‌ సీఐ బాలాజీతో సహా నలుగురు సిబ్బంది గాయపడిన వారిలో ఉన్నారు. దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

జడ్చర్ల ఆస్పత్రిలో వారికి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ బాధితులను పరామర్శించారు. ఘటనపై జడ్చర్ల పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. జడ్చర్ల మండలం ఉదండాపూర్‌ తండాకు చెందిన రాజుపై కేసు నమోదు చేశారు. దాడి చేసిన మరో ముగ్గురి ఆచూకీ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. 


logo