దామరచర్ల: అంగవైల్యం అతని ఆత్మైస్థెర్యం ముందు తలవంచింది. అంగవైకల్యం శరీరానికేగాని మనసుకు కాదు అనుకొని ముందుకు సాగుతూ మంచి మెకానిక్‌గా పేరు తెచ్చుకొని పది మందికి ఉపాధి కల్పిస్తున్న దివ్యాంగుడు నకిరేకంటి పాప య్య. శరీరంలో అవవయ లోపం ఉన్న తన సమయ స్పూర్తితో మెకానిక్‌గా పనిచేస్తూ చిన్న పని మొదలుకొని పెద్ద పను లు వ్యవసాయ మోటర్ల రిపేర్లు, అన్ని విద్యుత్తు పరికరాల మరమ్మతులు చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.
చిన్నప్పుడే పోలియోతో చేయి కోల్పోయి..
నకిరేకంటి పాపయ్య సొంత గ్రామం పాలకవీడు మండలం మూసొడ్డు సింగారం, తల్లిదండ్రులకు పాపయ్య మొదటి సంతా నం పుట్టిన ఆరు నెలలకు కుడి చేయికి పోలియో వచ్చి పడిపోయింది. దీనికి తోడు మూడేండ్ల వయసులో ఆడుకుంటూ కింద పడగా చేయి కాస్తా విరిగి పోగా పూర్తిగా తొలగించారు. పాపయ్య చిన్న వయసులోనే తండ్రి సోమయ్య చనిపోయా డు. ఇలాగే పదో తరగతి వరకు చదువుకున్నాడు. తల్లి కూలీపనితో కుటుంబం గడిచింది.
పాపయ్య తోడు ఇద్దరు తమ్ముళ్లు, నలుగురు చెల్లెలున్నారు. పదో తరగతి పూర్తి చేసుకొన్న పాపయ్య కుటుంబ ఆర్ధిక పరిస్థితులు బాగాలేక పోవడంతో చదువు మానేసి తనకు తెలిసిన వారితో 1991లో దామరచర్లకు చేరుకున్నాడు. స్నేహితుని వద్ద కరెటు పనినేర్చుకున్నాడు. తర్వాత సొంతంగా మెకానిక్ షాపు పెట్టుకున్నాడు తండ్రి సంపాదించిన ఆస్తిని అమ్మి తన సంపాదించిన డబ్బుతో నలుగురు చెల్లెల్ల పెండ్డిళ్లు చేశాడు.
ఒంటి చేత్తో విద్యుత్తు పరికరాల మరమ్మతులు
కరెంటు పరికరాల మరమ్మత్తులో ఏపని అయినా చిటికెలో చేసేస్తాడు. ప్యాన్లు, మిక్సీలు, చిన్న మోటర్లు, వ్యవసాయ మోటర్లు, కూలర్లు రిపేర్లు చేస్తాడు. బోర్లల్లో పైపులు వేయడం, నూతన ఇళ్లల్లో పైపులు వేయడం పెద్దపెద్ద పనులు కూడా చేస్తాడు. మోటర్ వైండింగ్ కూడా వేగంగా చేస్తాడు. కుడి చేయి లేకున్నా ఒంటిచేత్తో రిపేర్లు వేగంగా చేస్తాడు. వ్యవసాయ మోటర్లు ఏడాదికి రెండు బస్తాలు దాన్యం ఇస్తారు. ఇక పాలీష్ మిల్లులు, విద్యాసంస్థల్లో కూడా మరమ్మతులు చేస్తాడు.
80 మందికి ఉపాధి చూపిన పాపయ్య..
దామరచర్లలో 26 సంవత్సరాలుగా విద్యుత్ మెకానిక్‌గా పనిచేస్తున్న పాపయ్య వద్ద ఇప్పటి వరకు 80 మంది పని నేర్చుకొని స్థానికంగా, ఇతర ప్రాంతాల్లో షాపులు పెట్టుకొని ఉపాధి పొందుతున్నారు. వీరితో పాటుగా పలు పరిశ్రమల్లో కూడా కాంట్రాక్టు ఎలక్ట్రీషియన్లుగా పనిచేస్తున్నారు. మండలం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతో అనేక మంది యువకులు ఈ వృత్తిని ఎంచుకున్నారు. దీనితో ఎంతోమంది పాపయ్య వద్ద పని నేర్చుకొని స్థిరపడ్డారు.
ఆర్థికంగా ఇబ్బందులు
మారుతున్న కాలానుగుణంగా విద్యుత్తు పరికరాల మరమ్మతుల్లో అధునాతన మిషన్లు వచ్చినయి. వాటిని కొనుగోలు చేసి ఆర్ధిక పరిస్థితి లేక పాత పద్దతులతోనే మరమ్మతులు చేస్తున్నాడు. మోటర్ వైండింగ్‌కు అధునాతన మిషన్లు మార్కెట్లోకి వచ్చినయి. వాటి ద్వారా ఎంత పెద్ద మోటర్ అయిన కొద్ది సమయంలోనే వైండింగ్ పూర్తి అవుతుంది. తన వద్ద అలాంటి మిషన్లు లేక పోవడం వల్ల గిరాకి తగ్గిపోతొందనీ పాపయ్య ఆవేదన చెందుతున్నా డు.
ప్రభుత్వ పెన్షన్ ఆదుకుంటుంది : ఎన్ పాపయ్య
తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సీఎం కేసీఆర్ వికలాంగులకు నెలకు రూ. 3016 రూపాయల ఫించన్ ఇవ్వడం వల్ల దివ్యాంగులు సమాజంలో సగర్వంగా బతుకుతున్నారు. ప్రభుత్వం దివ్యాంగుల కోటాలో రుణం అందిస్తే నూతన పరికరా లు కొనుగోలు చేసుకొని షాపును ఆధునీకరించుకుంటా. ప్రభుత్వం తనకు రుణం అందజేస్తే వ్యాపారిన్ని పెంచుకొని తనతో పాటుగా మరి పదిమందికి ఉపాధిని కల్పిస్తా.