న్యూఢిల్లీ: సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్లో బోర్డు స్వల్ప సవరణలు చేసింది. సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలకు సంబంధించి సవరించిన తేదీలతో కూడిన డేట్‌షీట్‌ను శుక్రవారం విడుదల చేసింది. సీబీఎస్ఈ 10వ, 12వ తరగతుల పరీక్షలకు సంబంధించి ముందుగా ఫిబ్రవరి 2న షెడ్యూల్‌ను విడుదలచేసింది. తాజాగా ఆ షెడ్యూల్లో స్వల్ప సవరణలు చేసింది. సవరించిన షెడ్యూల్‌ను విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చని సీబీఎస్ఈ తెలిపింది.
ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మే 15వ తేదీన జరుగాల్సిన 10వ తరగతి సైన్స్ పరీక్ష మే 21వ తేదీకి వాయిదాపడింది. మే 21న జరుగాల్సిన మాథ్స్ పరీక్షను జూన్ 2కు వాయిదా వేశారు. అదేవిధంగా 12వ తరగతి సంబంధించి సైన్స్ స్ట్రీమ్‌లో మే 13న జరుగాల్సిన ఫిజిక్స్ పరీక్ష జూన్ 8కి వాయిదా పడింది. ఇక మ్యాథమాటిక్స్, అప్లయిడ్ మ్యాథమాటిక్స్ పరీక్షలు మే 31న జరుగనున్నాయి.