ఆదివారం 23 ఫిబ్రవరి 2020
ఆప్తమాలజీ ఆపరేషన్‌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి హరీశ్‌

ఆప్తమాలజీ ఆపరేషన్‌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి హరీశ్‌

Feb 15, 2020 , 15:57:56
PRINT
ఆప్తమాలజీ ఆపరేషన్‌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి హరీశ్‌

సిద్దిపేట:  జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో శనివారం ఉదయం రూ.10 లక్షల వ్యయంతో పునరుద్ధరణ చేసిన ఆప్తమాలజీ ఆపరేషన్ థియేటర్, రూ.10 లక్షలతో కంటి పరీక్షలు నిర్వహించే మిషనరీలను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఏఎంసీ చైర్మన్ పాల సాయిరాం, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ తమిళ్ అరసు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.  ఆస్పత్రిలోని డయాలసిస్‌ సెంటర్‌, బ్లడ్‌బ్యాంక్‌ను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... సిద్దిపేట, గజ్వేల్‌లో కంటి ఆపరేషన్‌ థియేటర్‌ అందుబాటులోకి తెచ్చామన్నారు. కంటి సమస్యలున్నవారు అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కంటి వెలుగులో సమస్యను గుర్తించిన వారికి ఆపరేషన్‌ చేస్తామన్నారు. సిద్దిపేటలో సింగిల్‌ పర్సనల్‌ ప్లేట్లెల్స్‌ సపరేటర్‌ను ప్రారంభించినట్లు వెల్లడించారు. డెంగ్యూ, ఇతర వైరల్ ఫీవర్ ఉన్నవారికి ఈ సింగిల్ పర్సనల్ ప్లేట్ లెట్స్ సపరేటర్ ఎంతో ఉపయోగకరమన్నారు. గతంలో  ప్లేట్ లెట్స్  తో ఇబ్బంది పడేవారు కరీంనగర్, హైదరాబాద్ కి వెళ్లేవారు. కానీ ఇప్పుడా ఆ పరిస్థితి కూడా ఉండదు. సిద్ధిపేట ప్రభుత్వ దవాఖానకు వచ్చి ప్లేట్ లెట్స్ సమస్యలు పరిష్కరించుకోవచ్చన్నారు. సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిని 40 పడకల డయాలసిస్‌ కేంద్రంగా చేసేందుకు కృషి చేస్తామన్నారు. ప్రస్తుతం 10 పడకల ఐసీయూ యూనిట్‌ను కలిగిన సిద్దిపేట ఆస్పత్రిని త్వరలోనే 20 పడకల ఐసీయూకు పెంచనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

logo