ఆదివారం 07 జూన్ 2020
Telangana - Mar 31, 2020 , 15:48:24

మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ కు స్పందించిన డిప్యూటీ స్పీకర్‌

మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ కు స్పందించిన డిప్యూటీ స్పీకర్‌

హైదరాబాద్‌:  సికింద్రాబాద్‌లోని మెట్టుగూడలో నివసిస్తున్న బీహార్‌కు చెందిన వారికి అన్ని సదుపాయాలు కల్పించాలని డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌కు మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.  మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌కు వెంటనే స్పందించిన పద్మారావు గౌడ్‌ తన కుమారుడి చేత వలస కార్మికులకు భోజనం ఏర్పాట్లు చేయించారు.  రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటుందని డిప్యూటీ స్పీకర్‌ తెలిపారు. లాక్‌డౌన్‌ ముగిసే వరకు వారిని జాగ్రత్తగా చూసుకుంటామని హామీ ఇచ్చారు. 

ఉపాధి కోసం వేరే రాష్ట్రం నుంచి వచ్చిన సుమారు 200 మంది వలస కార్మికులు చిలకలగూడలో ఉంటున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వీరు ఇబ్బందిపడుతున్నారని కేశవ్‌ కుమార్‌ అనే వ్యక్తి ట్విటర్‌ ద్వారా కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. వీరికి ఆశ్రయంతో పాటు భోజన వసతి కల్పించాలని డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుతో పాటు సికింద్రాబాద్‌ జోనల్‌ కమిషనర్‌కు కేటీఆర్‌ సూచించారు. దీనిపై పద్మారావు వేగంగా స్పందించి కార్మికుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వలసకూలీలు డిప్యూటీ స్పీకర్‌తో పాటు కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. logo