మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 27, 2020 , 00:30:29

అసిస్టెంట్‌ ఇంజినీర్‌కు రెండేండ్ల జైలు.. ఏసీబీ కోర్టు తీర్పు

అసిస్టెంట్‌ ఇంజినీర్‌కు రెండేండ్ల జైలు.. ఏసీబీ కోర్టు తీర్పు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పార్కింగ్‌ స్థలం విషయంలో రూ.15 వేలు లంచం తీసుకున్నట్టు నిరూపణ కావడంతో ఏపీ హౌ సింగ్‌బోర్డు ఏఈ బీజే ప్రేమ్‌ప్రకాశ్‌కు రెండేండ్లు కఠిన కారాగార శిక్ష విధిస్తూ ఏసీబీ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు ఏసీబీ ప్రిన్సిపల్‌ స్పెషల్‌ జడ్జి సాంబశివరావునాయుడు శుక్రవారం తీర్పువెల్లడించారు.ఉమ్మడి రాష్ట్ర ంలో ఏపీ హౌసింగ్‌బోర్డు అసిస్టెంట్‌ ఇంజినీర్‌గా పనిచేసిన బీజే ప్రేమ్‌ప్రకాశ్‌ 2011 జనవరి 17న హైదరాబాద్‌ నాంపల్లి మనోరంజన్‌కాంప్లెక్స్‌లో పార్కింగ్‌ వ్యాపారం నిర్వహిస్తున్న కే అరవింద్‌రావు నుంచి రూ. 15 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు.  


logo