బుధవారం 20 జనవరి 2021
Telangana - Jan 14, 2021 , 02:14:05

వ్యాక్సినేషన్‌కు సహకరించాలి

వ్యాక్సినేషన్‌కు సహకరించాలి

  • బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ 

విద్యానగర్‌, జనవరి 13: కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలని బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ కోరారు. బుధవారం కరీంనగర్‌ జిల్లాలో వ్యాక్సినేషన్‌ ఏర్పాట్లపై అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. ఈ నెల 16న వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమవుతున్నదని, సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులందరూ కార్యక్రమానికి సహకరించాలని కోరారు. మొదట హెల్త్‌కేర్‌ వర్కర్లు, అంగన్‌వాడీలు, ఆశ కార్యకర్తలకు వ్యాక్సిన్‌ ఇస్తారని చెప్పారు.  


logo