బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 07, 2020 , 09:02:33

గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో నేడు చర్చ

గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో నేడు చర్చ

హైదరాబాద్‌ :  అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ, ఆమోదం చేపట్టనున్నారు. ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని శాసనసభలో ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ ప్రవేశపెట్టనున్నారు. ఈ తీర్మానాన్ని ఎమ్మెల్యే వివేకానంద బలపరచనున్నారు. అదేవిధంగా శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. చర్చకు సీఎం కేసీఆర్‌ సమాధానం ఇస్తారు. అనంతరం ఆర్డినెన్స్‌ల స్థానంలో ప్రభుత్వం ఉభయసభల్లో నేడు రెండు బిల్లులను ప్రవేశపెట్టనుంది. కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులను లాభదాయక పదవుల జాబితా నుంచి తొలగిస్తూ అదేవిధంగా లోకాయుక్త, ఉపలోకాయుక్త చట్టానికి సవరణ చేస్తూ ప్రభుత్వం గతంలో ఆర్డినెన్స్‌ తెచ్చింది. ఈ ఆర్డినెన్స్‌ల స్థానంలో సీఎం కేసీఆర్‌ నేడు సభలో రెండు బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్‌ వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్‌, సింగరేణి కాలరీస్‌ వార్షిక నివేదికను మంత్రి జగదీశ్‌రెడ్డి నేడు సభ ముందుంచనున్నారు. కాగా శాసనసభ, శాసనమండలిలో ఇవాళ ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు.


logo