గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 16, 2020 , 14:52:15

మంజీరా నదికి పూజలు చేసిన అసెంబ్లీ స్పీకర్ పోచారం

మంజీరా నదికి పూజలు చేసిన అసెంబ్లీ స్పీకర్ పోచారం

కామారెడ్డి : జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు భారీ వర్షాలకు నిండు కుండలా మారి జలకళతో ఉట్టిపడుతోంది. ఈ మేరకు ప్రాజెక్ట్ వద్ద మంజీరా నదికి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి హారతి ఇచ్చి గంగమ్మ తల్లికి పూజలు చేశారు. కార్యక్రమంలో జుక్కల్ శాసనసభ్యుడు హన్మంత్ షిండే, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, కామారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్ ధఫేదార్ శోభ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
logo